kollywood: తెలుగు భాష గొప్పతనం ఇప్పుడు తెలిసింది!: తమిళ నటుడు సూర్య!

  • తెలుగు భాషను కొనియాడిన తమిళ నటుడు సూర్య
  • పండుగకు విడుదల కానున్న ‘గ్యాంగ్’
  • స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న నటుడు

తెలుగు భాషను ‘సుందర భాష’ అని ఎందుకు అంటారో, ఆ భాష గొప్పతనమేంటో తనకు ఇప్పటికి తెలిసిందని కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య అన్నాడు. ఆయన నటించిన ‘గ్యాంగ్’ సినిమా సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతోంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘స్పెషల్ ఛబ్బీస్’ సినిమాకు ఇది రీమేక్ అని తెలిపాడు. సినిమాను విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకునేలా ఉంటుందని అన్నాడు. కొత్తదనానికి దూరమవుతున్నానన్న భావన ఈ సినిమాతో తొలగిపోయిందన్నాడు.

‘గ్యాంగ్’ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఎంతగానో ఆస్వాదించానని సూర్య వివరించాడు. తెలుగు భాషలోని గొప్పదనం తెలిసిందని, దానిని ‘సుందర తెలుగు’ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందని పేర్కొన్నాడు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి తనకు 46 రోజులు పట్టిందన్నాడు. తెలుగును మున్ముందు  మరింత బాగా నేర్చుకుంటానని సూర్య పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News