deepika padukone: దీపికా పుట్టినరోజుకి ఖరీదైన వజ్రాల హారం బహుమతిగా ఇచ్చిన రణ్వీర్ తల్లిదండ్రులు
- ఓ ఖరీదైన చీర కూడా
- మాల్దీవుల్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు
- నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు
జనవరి 5న దీపికా పదుకునే పుట్టినరోజు సందర్భంగా ప్రియుడు రణ్వీర్ సింగ్ తల్లిదండ్రులు అంజు భవ్నాణీ, జగ్జీత్ సింగ్ భవ్నాణీలు ఆమెకు ఖరీదైన వజ్రాల హారం, సబ్యసాచి డిజైన్ చేసిన చీరను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో దీపికా 32వ పుట్టినరోజు వేడుకలు మాల్దీవుల్లో జరిగాయి. అయితే ఈ పుట్టినరోజు వేడుకలనే నిశ్చితార్థంగా భ్రమపడి బాలీవుడ్ మీడియా పుకార్లు సృష్టించింది.
గత నాలుగేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్‌ల నిశ్చితార్థం జరిగిందని, విరాట్-అనుష్కల పెళ్లి ఆదర్శంగా తీసుకుని వీరు కూడా తమ వివాహాన్ని సింపుల్ గా, ప్రైవేటు వ్యవహారంగా నిర్వహించుకోవాలనుకుంటున్నారని కథనాలు వచ్చాయి. అయితే గతంలో చాలా సార్లు దీపికా, రణ్‌వీర్‌ల కుటుంబాలు కలిసి విహారయాత్రలకు, పర్యటనలకు వెళ్లడం జరిగింది. దీంతో ఈ పుట్టినరోజు మాల్దీవుల ట్రిప్ కూడా అలాంటిదేనని, నిశ్చితార్థం జరిగిన దాఖలాలు కనిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు.