sharwanand: పది కేజీల బరువు తగ్గిన శర్వానంద్
- శర్వానంద్ హీరోగా 'పడి పడి లేచే మనసు'
- దర్శకుడిగా హను రాఘవపూడి
- కోల్ కతాలో మొదలైన షూటింగ్
దర్శకుడు హను రాఘవపూడి పేరు వినగానే ఆయన తెరకెక్కించిన 'అందాల రాక్షసి' .. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాలు గుర్తొస్తాయి. ఆయన తాజా చిత్రం .. శర్వానంద్ హీరోగా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'పడి పడి లేచే మనసు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోల్ కతాలో మొదలైంది.
ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా కోసం, శర్వానంద్ 10 కేజీల బరువు తగ్గాడట. అంతే కాకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడని అంటున్నారు. క్రేజీ కాంబినేషన్ .. రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై యూత్ లో ఆసక్తి .. అంచనాలు వున్నాయి