anchor anasuya: తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన యాంకర్ అనసూయ
- ఈ పరిణామం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది
- వాస్తవం తెలుసుకోకుండా అభాండాలు వేయడం తగదు
- నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు : అనసూయ
యాంకర్, టాలీవుడ్ నటి అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఫోన్ ను పగలగొట్టడమే కాక, తమపై దుర్భాషలాడిందని ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. ఈ విషయమై అనసూయ స్పందిస్తూ, ఈ పరిణామం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, వాస్తవం తెలుసుకోకుండా, ప్రజలు తనపై అభాండాలు మోపడం బాధ కలిగిస్తోందని ఆమె వాపోయింది.
ఇప్పటివరకు తనను నమ్ముతూ, తనకు మద్దతుగా నిలిచిన వారికీ తన ధన్యవాదాలు చెబుతున్నానని అనసూయ పేర్కొంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అయితే, ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి భిన్న విమర్శలు రావడంతో, కొంచెం సేపటికే ఆ పోస్ట్ ను ఆమె తొలగించింది.