Padman: 'ఛీ' అంటూ 'ప్యాడ్ మ్యాన్'ను చూసేందుకూ ఇష్టపడని పాకిస్థాన్ సెన్సార్ బోర్టు!

  • పాక్ ఆచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకం
  • విడుదలకు ససేమిరా అంటున్న పాక్ అధికారులు
  • ఆవేదన వ్యక్తం చేస్తున్న దర్శకుడు బాల్కి

మహిళల రుతుక్రమంపై చర్చిస్తూ, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన పెంచుతూ అక్షయ్ కుమార్ నటించిన 'ప్యాడ్ మ్యాన్' ఓ వైపు బాక్సాఫీసు వద్ద దూసుకెళుతుండగా, అసలు ఈ చిత్రాన్ని చూసేందుకు కూడా పాకిస్థాన్ సెన్సార్ బోర్టు సభ్యులు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తమ ఆచారాలు, సంప్రదాయాలను నాశనం చేసేలా ఉందని సెన్సార్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సినిమా దర్శకుడు ఆర్ బాల్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళల ఆరోగ్యానికి సంబంధించి తీసిన సినిమా సంప్రదాయాలకు విరుద్ధమని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ చిత్రాన్ని పాక్ లో ప్రదర్శనకు అనుమతించాలని కోరారు. ఆసియాలో నెలసరి సమస్యలతో మరణించిన వారు ఎందరో ఉన్నారని, ఇక్కడి మహిళలకు ఈ చిత్రం అవసరమని తెలిపారు. కాగా, పాక్ సెన్సార్ బోర్టు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం. పలువురు బోర్టు సభ్యులు సినిమా చూడాలని కోరితే ఎవరికి వారు 'ఛీ' అంటూ పక్కకు తప్పుకున్నారట.

  • Loading...

More Telugu News