Sridevi: శ్రీదేవికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.. నమ్మలేకపోతున్నా!: సంజయ్ కపూర్
- శ్రీదేవికి హృద్రోగ సమస్యలు ఏమీ లేవు
- ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది
- ఆమెకు గుండెపోటు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాం
అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ఆమె మరిది సంజయ్ కపూర్ (బోనీకపూర్ తమ్ముడు) మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. తన హోటల్ గదిలో శ్రీదేవి స్పృహ కోల్పోయి కనపడిందని, ఆమెను వెంటనే దుబాయ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. శ్రీదేవికి ఎలాంటి హృద్రోగ సమస్యలు లేవని ఆయన అన్నారు. ఒక్కసారిగా గుండెపోటు ఎలా వచ్చిందో తెలియడం లేదని, ఆమె మృతి చెందిన విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.