Amitabh Bachchan: బాలకృష్ణ సూచనతో వాయిదాపడ్డ లేపాక్షి ఉత్సవాలు!
- 9, 10 తేదీల్లో జరగాల్సిన లేపాక్షి ఉత్సవాలు వాయిదా
- ఈ నెల 31, ఏప్రిల్ 1న నిర్వహణ
- లేపాక్షికి కృష్ణా జలాలు వచ్చాకే ఉత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశించారు : కలెక్టర్ వీరపాండ్యన్
ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన లేపాక్షి ఉత్సవాలు వాయిదాపడ్డాయి. ఈ ఉత్సవాలను ఈ నెల 31, ఏప్రిల్ 1న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను లేపాక్షికి తీసుకువచ్చే పనులు ఆలస్యం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చాకే ఈ ఉత్సవాలు ప్రారంభించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశించారని అన్నారు.
కృష్ణా జలాలు లేపాక్షికి తీసుకురావడమనేది ఓ చరిత్ర అని, అందుకోసం, బాలకృష్ణ పట్టుదలతో ఉన్నారని అన్నారు. హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను తీసుకు వచ్చే నిమిత్తం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రైతులందరూ అర్థం చేసుకుని సహకరించాలని ఈ సందర్భంగా వీరపాండ్యన్ కోరారు. ఈ నెల 31న లేపాక్షి చెరువులో జలహారతి కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు వీరపాండ్యన్ చెప్పారు.