Donald Trump: ఆమెతో నాకు సంబంధాలు లేవు: డొనాల్డ్ ట్రంప్
- ట్రంప్ తో శారీరక సంబంధం ఉందని ఆరోపించిన పోర్న్ స్టార్
- డబ్బిచ్చి సంతకాలు చేయించుకున్నారంటూ ఆరోపణ
- ఆరోపణలను ఖండించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో తనకు శారీరక సంబంధాలు ఉండేవని... ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఉంచేందుకు... ఆయన న్యాయవాది మైఖేల్ కోహెన్ తనకు రూ. 1.30 లక్షల డాలర్లు ఇచ్చి, కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారంటూ పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫర్డ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, స్టెఫానీ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆయన అన్నారు. వైట్ హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారని తెలిపారు.