sruthi: నిద్రపోయేముందు ఒకసారి ఆలోచిస్తాను: శ్రుతి హాసన్
- ఇష్టం లేని పనులు చేయను
- ఎవరినీ బాధ పెట్టను
- మా నాన్న చెప్పిన మాట ఇది
కొంతమందికి అనారోగ్య కారణాల వలన నిద్ర పట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మరికొంతమందికి నిద్రపట్టదు. అలా జరిగింది అంటే వాళ్లలో కొంతమందైనా ఆ రోజున ఏదో ఒక పొరపాటు చేసినట్టేనని శ్రుతి హాసన్ తో కమల్ చెబుతూ ఉండేవారట. ఆ పొరపాటు ఏమిటనే విషయం గుర్తుచేసుకుని .. మరోమారు అలా జరగకుండా చూసుకోమని ఆయన అనేవారట.
అందువలన రాత్రి తాను నిద్రపోయే ముందు .. ఆ రోజంతా తాను చేసిన పనులను శ్రుతి ఒకసారి గుర్తు చేసుకుంటుందట. ఆ రోజున ఇష్టం లేకపోయినా ఏదైనా పని చేసి వున్నా, ఎవరినైనా బాధపెట్టినట్టు అనిపించినా, ఇకపై అలా చేయనని బలంగా నిర్ణయించుకుని అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుందట. ఏ విషయంలోనైనా ఆత్మ పరిశీలన అవసరమేనని ఆమె సెలవిస్తోంది.