samanta: ఒక్కసారి నేను తల్లిగా మారితే, ఇక నాకు పిల్లలే ప్రపంచం: హీరోయిన్ సమంత
- పిల్లల గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు
- పిల్లల్ని కనేందుకు ఓ టైమ్ అనుకున్నాం
- ఆ టైమ్ వచ్చే వరకు కెరీర్ పైనే దృష్టి
తాను, తన భర్త నాగ చైతన్య పిల్లల గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని, పిల్లల్ని కనేందుకు ఓ టైమ్ అనుకున్నామని హీరోయిన్ సమంత తెలిపింది. ఆ టైమ్ వచ్చే వరకు తమ కెరీర్ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నామని చెప్పింది. హీరోయిన్ సమంత తల్లి కాబోతోందంటూ ఇటీవల బాగా ప్రచారం జరిగింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించి ఇలా వ్యాఖ్యానించింది. కాగా, ఒక్కసారి తాను తల్లిగా మారితే, ఇక తనకు పిల్లలే ప్రపంచమని తెలిపింది. ఇటీవలే 'రంగస్థలం' సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సమంత ప్రస్తుతం 'మహానటి'లో నటిస్తోన్న విషయం తెలిసిందే.