charan: 'రంగస్థలం'లో సర్పంచ్ ను నాకే చంపేయాలనిపించింది: జగపతిబాబు
- సుకుమార్ పనితీరు అద్భుతం
- సర్పంచ్ పాత్రను గొప్పగా మలిచాడు
- ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది
'రంగస్థలం' సినిమా కోసం చరణ్ తరువాత తాను అనుకున్న నటుడు జగపతిబాబు అని దాదాపు అన్ని ఇంటర్వ్యూస్ లోను సుకుమార్ చెప్పాడు. ఆయన ఎంపిక తరువాతనే ఆ స్థాయికి తగిన మిగతా పాత్రధారులను తీసుకున్నానని ఆయన అన్నాడు. అంతటి ప్రాముఖ్యతను కలిగిన సర్పంచ్ పాత్రను జగపతిబాబు పోషించారు.
లుంగీ .. ఖద్దరు బనీనుతో .. చుట్ట కాలుస్తూ విలన్ గా ఆయన ఈ సినిమాలో అదరగొట్టేశారు. ఇంతవరకూ తాను చేసిన పాత్రల్లో ఈ పాత్రకి ఎక్కువ మార్కులు వేసుకుంటానని తాజాగా జగపతిబాబు అన్నారు. ఈ పాత్రను సుకుమార్ మలిచిన తీరు అద్భుతమని చెప్పారు. ఈ పాత్రకి డబ్బింగ్ చెబుతున్నప్పుడు .. ఆ సర్పంచ్ ను చంపేయాలన్నంత కోపం నాకే వచ్చింది. అంత గొప్పగా ఆ పాత్రను సుకుమార్ ఆవిష్కరించాడు .. నా లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇది అని చెప్పుకొచ్చారు.