Anitha: టీటీడీ బోర్డులో తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబుకి ఎమ్మెల్యే అనిత లేఖ!

  • నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు
  • నా నియామకాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు
  • రాష్ట్ర సర్కారుకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు
  • అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను-అనిత

టీటీడీ బోర్డులో టీడీపీ ఎమ్మెల్యే అనిత నియామకాన్ని పలువురు విమర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను క్రిస్టియన్ అంటూ అనిత చెప్పిన ఓ వీడియో బయటకు రావడంతో దానిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనిత మాత్రం తాను హిందువునే అని మీడియాకు వివరణ ఇచ్చారు. అయితే, అనూహ్యంగా, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే అనిత లేఖ రాసి తన నియామకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

టీటీడీ పాలకవర్గంలో తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలని అనిత అందులో పేర్కొన్నారు. తన నియామకాన్ని కొందరు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, ఈ విషయం వల్ల రాష్ట్ర సర్కారుకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు. 

  • Loading...

More Telugu News