rana: మరోమారు తేజ దర్శకత్వంలో రానా .. ఈ సారి ఎయిర్ ఫోర్స్ అధికారిగా
- విభిన్నమైన పాత్రలు చేస్తోన్న రానా
- తాజాగా తేజతో కథా చర్చలు
- త్వరలో పూర్తి వివరాలు
హీరోగా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేయడానికి రానా ఆసక్తిని చూపుతున్నాడు. ఈ క్రమంలో ఆయన చేసిన 'ఘాజీ' .. 'నేనే రాజు నేనే మంత్రి' ఘన విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఆయన హిందీలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయన మరో సినిమాను అంగీకరించినట్టు సమాచారం. ఈ సినిమాలో రానా ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నాడని అంటున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించనున్నాడని చెబుతున్నారు. గతంలో తేజ .. రానా కాంబినేషన్లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.