mani sharma: సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి కన్నుమూత
- చెన్నైలో కన్నుమూసిన యనమండ్ర నాగయజ్ఞ శర్మ
- వయోలిన్ విద్వాంసుడిగా ఖ్యాతి
- ఆయన వయసు 92 సంవత్సరాలు
ఎన్నో సినిమాలకు పసందైన పాటలను, సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ ఈ ఉదయం కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వయోలిన్ విద్వాంసుడిగా నాగయజ్ఞ శర్మకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో, ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.