nikisha patel: మీడియా ప్రశ్నలను తట్టుకోలేకే అబద్ధం చెప్పా: నికిషా పటేల్

  • మీకు ఏ హీరో అంటే ఇష్టమనే ప్రశ్న వినీవినీ చికాకు వచ్చింది
  • అందుకే ప్రభుదేవా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పా
  • ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోతే మంచిది

ప్రభుదేవా ఒప్పుకుంటే ఆయనను పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ నికిషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలకు ఆమె వివరణ ఇచ్చింది. ప్రతి ఇంటర్వ్యూలో మీకు ఏ హీరో అంటే ఇష్టం? అనే ప్రశ్న వినీవినీ చికాకు వచ్చిందని... అందుకే ప్రభుదేవా అంటే తనకు ఇష్టమని చెప్పానని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పానని తెలిపింది.

అయితే, మీడియా ప్రశ్నలకు తట్టుకోలేకే ఆ రోజు అలా చెప్పానని వివరించింది. వాస్తవానికి ఆయనను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని... ఏదో పొరపాటున ఒక్క మాట అంటే దాన్ని రాద్ధాంతం చేస్తారని వాపోయింది. ప్రభుదేవాతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని... ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోతే మంచిదనేదే తన ఉద్దేశమని చెప్పింది. 

  • Loading...

More Telugu News