anasuya: పెళ్లిరోజున మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ
- ఈ రోజు అనసూయ పెళ్లిరోజు
- భర్తతో కలసి మాల్దీవుల్లో సెలబ్రేషన్స్
- ఎంతో ఆనందంగా ఉందన్న రంగమ్మత్త
ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా తన భర్త భరద్వాజ్ తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది రంగమ్మత్త. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఎప్పట్లాగానే తన భర్త ఈ ఏడాది కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడని తెలిపింది. ఈ ఏడాది మాల్దీవ్స్ కు వచ్చామని పేర్కొంది. ఇంతకంటే ఎక్కువ ప్రేమను పొందగలమా? అంటూ ట్వీట్ చేసింది. ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా మాల్దీవుల్లో ఓ బీచ్ లో సేదతీరుతున్న ఫొటోను షేర్ చేసింది.