Karnataka: కర్ణాటకలో ‘కాలా’ను అడ్డుకుంటామనడంపై కమల్ స్పందన!

  • రెండు రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్స్ ఈ మేరకు చర్చలు జరపాలి
  • కర్ణాటకలో ‘కాలా’ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు
  • రైతు అంశాలపైనే కాదు, సినిమాల విషయంలోనూ చర్చలు అవసరమే!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కర్ణాటకలో కూడా ఈ చిత్రం విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కన్నడ సంఘాలు మాత్రం ‘కాలా’ విడుదలకు అభ్యంతరాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమలహాసన్ స్పందిస్తూ, రజనీకాంత్ కు మద్దతుగా నిలిచారు.

గతంలో తన చిత్రం ‘విశ్వరూపం’ను కూడా కర్ణాటకలో నిషేధించిన విషయాన్ని ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్స్ ఈ మేరకు చర్చలు జరపాలని సూచించారు. కర్ణాటకలోని రజనీకాంత్ అభిమానులు చాలా మంది ‘కాలా’ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. రైతులకు సంబంధించిన అంశాలపై  ఏ విధంగానైతే చర్చలు అవసరమో, సినిమాల విషయంలోనూ అదే మాదిరి చర్చలు అవసరమని సూచించారు.

  • Loading...

More Telugu News