Pawan Kalyan: తన పెద్ద కొడుకు అకీరాతో కలసి పవన్ గృహప్రవేశం!
- పటమట ప్రాంతంలో ఇల్లు తీసుకున్న పవన్
- అకీరాను వెంటబెట్టుకుని వచ్చిన పవన్
- అభిమానుల్లో ఆనందం, ఆశ్చర్యం
విజయవాడలోని పటమట ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకున్న పవన్ కల్యాణ్, ఈ ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ భార్య అన్నా లెజినోవా, పవన్- రేణూ దేశాయ్ ల తనయుడు అకీరా తదితరులు పాల్గొన్నారు. తన పెద్ద కుమారుడిని వెంట బెట్టుకుని పవన్ గృహ ప్రవేశం చేయడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.
ఇక పవన్ అద్దెకు తీసుకున్న ప్రాంతం చుట్టుపక్కల పోలీసులు తనిఖీలు నిర్వహించి, ఆ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్ ఆ ఇంట్లో ఉన్నంత సేపూ ప్రత్యేక సెక్యూరిటీని, 24 గంటల కాపలాను ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.