priyanka chopra: ప్రియుడితో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా
- నిక్ జొనాస్ తో ప్రేమలో పడ్డ ప్రియాంక
- ముంబైలో సందడి చేసిన జంట
- ఈ తెల్లవారుజామున ముంబై నుంచి తిరుగుపయనం
తన ప్రియుడు, పాప్ సింగర్ నిక్ జొనాస్ తో కలసి ముంబైకి వచ్చిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా... నాలుగు రోజుల పాటు సందడి చేసింది. వీరిద్దరికి సంబంధించిన వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఈ తెల్లవారుజామున ఇద్దరూ కలసి ముంబై నుంచి వెళ్లిపోయారు. చేతిలో చేయి వేసుకుని ఇద్దరూ వెళ్తున్న ఫొటోలు కెమెరాకు చిక్కాయి. ముంబై నుంచి ఇద్దరూ కలసి దుబాయ్ కి వెళ్లారని సమాచారం. మరొక సోర్స్ ప్రకారం ఇద్దరూ అమెరికాకు తిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది.