murali mohan: ఆ వీడియో ఎవరు తీశారో గుర్తించాం: 'బరువు తగ్గాలనుకుంటే దీక్ష'పై మురళీ మోహన్‌

  • అది కోవర్టు ఆపరేషన్‌ కాదు
  • సరదాగా మాట్లాడుకున్నవి కెమెరాకు చిక్కితే విపరీత అర్థాలు
  • ఆ ఘటన తరువాత జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నాం

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతలు రాష్ట్రంలో పోరాడుతోంటే అదే సమయంలో ఢిల్లీలో ఓ గదిలో కూర్చొని 'బరువు తగ్గాలనుకుంటే నిరాహార దీక్ష చేస్తాను' అంటూ టీడీపీ ఎంపీలు మాట్లాడుకుంటుండగా తీసిన ఓ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాను 5 కేజీల వరకూ బరువు తగ్గాలని అనుకుంటున్నానని ఓ వారం రోజుల పాటు దీక్షలో కూర్చోగలనని ఎంపీ మురళీ మోహన్‌ అంటున్నట్లు ఆ వీడియో ఉండడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ విషయంపై మురళీ మోహన్‌ తాజాగా స్పందించారు. ఆ వీడియో ఎవరు తీశారో తాము గుర్తించామని, ఇది కోవర్టు ఆపరేషన్‌ మాత్రం కాదని మురళీ మోహన్‌ అన్నారు. ఆ ఘటన తరువాత సరదాగా మాట్లాడుకున్నవి కూడా కెమెరాకు చిక్కితే విపరీత అర్థాలు వస్తాయని గుర్తించామని, అప్పటి నుంచి కాస్త జాగ్రత్తపడాల్సి వస్తోందని అన్నారు.      

  • Loading...

More Telugu News