sameer: ఎన్టీఆర్ తో కలిసి మేమంతా తెగ అల్లరి చేసేవాళ్లం: నటుడు సమీర్
- ఎన్టీఆర్ తో ఫ్రెండ్లీగా వుండే వాళ్లం
- అప్పట్లో ఆయన ఇంటికి వెళ్లే వాళ్లం
- లొకేషన్ లోను అల్లరే అల్లరి
బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్, ఆ తరువాత వెండితెరకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ .. ప్రేక్షకులను మెప్పిస్తూ వెళుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఎన్టీఆర్ తో తనకి గల అనుబంధం గురించి ప్రస్తావించాడు.
"నేను .. రాజీవ్ కనకాల .. రఘు .. శ్రీనివాస రెడ్డి .. మేమంతా కూడా ఎన్టీఆర్ తో ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్లం. అప్పట్లో ఎన్టీఆర్ కి షూటింగ్ లేకపోతే మా అందరికీ ఫోన్ చేసేవారు. అందరం కలిసి వాళ్ల ఇంటికి వెళ్లే వాళ్లం. అక్కడే భోజనం చేసేసి .. తెగ అల్లరి చేసేవాళ్లం. ఇక మేము షూటింగు స్పాట్ లో వున్నా అదే అల్లరి కొనసాగుతూ ఉండేది. ఎన్టీఆర్ హీరోగా చేసిన 'నా అల్లుడు' సినిమాలో మా బ్యాచ్ అంతా ఉండేది .. షూటింగ్ విరామ సమయంలో మేం చేసిన గోల అంతా ఇంతా కాదు" అంటూ చెప్పుకొచ్చాడు.