Lavanya Tripathi: మౌనంగా వుంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా?: లావణ్య త్రిపాఠి ఫైర్
- ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి అని వార్నింగ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి
- సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్ పై ఫైర్
- తొలిప్రేమ, గీత గోవిందం సినిమాలు వదులుకున్నాననే వార్త ఫేక్
సినీ ప్రపంచంలో గాసిప్స్ ఎదుర్కోని హీరోయిన్స్ దాదాపు ఉండరు. అయితే చాలామంది ఆ గాసిప్స్ ని పెద్దగా పట్టించుకోరు. కానీ అందాల రాక్షసిగా పరిచయమై సోగ్గాడే చిన్ని నాయనా, భలే భలే మగాడివోయ్ వంటి సినిమాలతో హిట్ కొట్టిన లావణ్య త్రిపాఠి తన గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించింది. 'నా గురించి వస్తున్న గాసిప్స్ పై మౌనంగా ఉంటున్నానంటే దాని అర్థం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని కాదు' అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
ఇంతకూ ఈ ఉత్తరాది ముద్దుగుమ్మకు కోపం ఎందుకొచ్చిందో తెలుసా.. టెక్నాలజీ పెరిగాక సినిమా ముచ్చట్లను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు నెటిజన్లు. తాజాగా శృతి అనే ఓ నెటిజన్ లావణ్య త్రిపాఠి వదిలేసిన రెండు సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యాయంటూ ట్వీట్ చేసింది. తొలిప్రేమ, గీత గోవిందం సినిమాలను లావణ్య వదులుకున్నారు కానీ అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అంటూ చేసిన ట్వీట్ పై లావణ్య స్పందించింది.
అది ఫేక్ న్యూస్ అని, అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని ఫైర్ అయింది. ఈ విషయాన్ని లావణ్య తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ‘ఇంటిలిజెంట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య వరుణ్ తేజ్ తో అంతరిక్షం, నిఖిల్ జంటగా ముద్ర చిత్రంలో బిజీగా వుంది. అంత బిజీలోనూ తనపై వస్తున్న గాసిప్స్ పై లావణ్య త్రిపాఠి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందన్న మాట.