vijay devarakonda: నా ఫ్రెండ్స్ ఇప్పటికీ నాతో అలాగే ఉంటున్నారు: విజయ్ దేవరకొండ
- నా ఫ్రెడ్స్ నన్ను స్టార్ లా చూడరు
- ఇప్పటికీ ఆటపట్టిస్తుంటారు
- సరదాగా గేమ్స్ ఆడుతుంటాం
'గీత గోవిందం' సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల గ్రాస్ ను రాబట్టేసి, విజయ్ దేవరకొండను స్టార్ హీరోల జాబితాలోకి చేర్చేసింది. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ఆయన, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'స్టార్ స్టేటస్ వచ్చేశాక గతంలోని ఫ్రెండ్స్ మీతో ఎలా వుంటున్నారు? మీరు స్టార్ అయ్యారు గనుక వాళ్ల ధోరణిలో మార్పు వచ్చిందా? విజయ్ స్టార్ అయ్యాడు .. అతని స్టేటస్ కి తగినట్టుగా కాస్త గ్యాప్ మెయింటెయిన్ చేయాలని అనుకుంటున్నారా ?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.
అందుకు విజయ్ దేవరకొండ నవ్వుతూ .. "నా ఫ్రెండ్స్ అలా అనుకుంటే బాగానే వుండేది గానీ .. అట్లా అనుకోరు. నిన్న రాత్రి అందరూ మా ఇంట్లోనే వున్నారు. నాతో బయటికి రావాలంటే ఇబ్బంది పడతారు గానీ .. ఇంటికి వచ్చేస్తూ వుంటారు. చిన్నప్పటి నుంచి మేమంతా మంచి స్నేహితులం. ఇప్పటికీ వాళ్లు నన్ను అట్లనే ఆటపట్టిస్తుంటారు .. గోల చేస్తుంటారు. మేమంతా కలుసుకున్నప్పుడు లైఫ్ .. కెరియర్ అంటూ సీరియస్ గా ఆలోచించం. సరదాగా గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తామంతే. ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లర పనులు .. టైమ్ వేస్టు పనులే ఎక్కువ" అంటూ నవ్వేశాడు.