Telangana Election 2018: స్పష్టమైన ఆధిక్యం దిశగా టీఆర్ఎస్... 82 స్థానాల్లో లీడ్!
- 199 స్థానాలకు కౌంటింగ్ మొదలు
- 22 చోట్ల ప్రజా కూటమి లీడింగ్
- బీజేపీ 5, ఇతరులు 4 చోట్ల ముందంజ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 119 స్థానాలకు కౌంటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ 84 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి 22 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో ముందున్నారు. మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ అదనంగా మరో 24 చోట్ల మెజారిటీ చూపుతుండటం గమనార్హం. యాకత్ పురాలో అనూహ్యంగా ఎంఐఎం వెనుకబడగా, బీజేపీ ముందంజలో నిలిచింది.