Deepika Padukone: నాలుగేళ్ల క్రితమే ఎంగేజ్ మెంట్ జరిగింది: దీపికా పదుకునే
- షాకింగ్ నిజాన్ని వెల్లడించిన దీపిక
- ఈ విషయాన్ని ఎన్నడూ బయటపెట్టలేదు
- రానున్న పుట్టినరోజు నాకు ఎంతో స్పెషల్
బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఏకమైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. నాలుగేళ్ల క్రితమే రణవీర్ తో తనకు ఎంగేజ్ మెంట్ అయిందని తెలిపింది. కానీ, ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని చెప్పింది. తమ ఎంగేజ్ మెంట్ విషయం బయటకు రాకున్నా... తమ గురించి వార్తలు వస్తూనే వచ్చాయని తెలిపింది. త్వరలోనే రానున్న తన పుట్టినరోజు తనకు ఎంతో స్పెషల్ అని... ఒకరి భార్యగా తొలి పుట్టినరోజును జరుపుకోబోతున్నానని చెప్పింది.