suman: చిరంజీవి గారు అంటే పడని వాళ్లే ఆ పుకార్లు సృష్టించారు: నటుడు సుమన్
- స్నేహితుల కారణంగా అలా జరిగింది
- చిరంజీవికి సంబంధం లేదు
- కరుణానిధి చాలా హెల్ప్ చేశారు
హీరోగా సుమన్ నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయన ఒక కేసు విషయమై జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఈ సంఘటన వెనుక చిరంజీవి హస్తం ఉందనే ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. అసలు ఈ సంఘటనతో చిరంజీవికి సబంధమే లేదని సుమన్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించిన ప్రశ్న ఎదురైతే మళ్లీ ఆయన అదే మాట చెప్పారు.
"నేను జైలుకి వెళ్లడానికి సంబంధించిన కేసులో చిరంజీవికి గానీ .. ఆయన కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి సంబంధం లేదు. చిరంజీవి అంటే పడనివాళ్లు కొంతమంది ఈ పుకారును సృష్టించారు. అప్పట్లో టీవీలు .. ఇంటర్నెట్ లు లేవు .. పేపర్లు - మేగజైన్లు మాత్రమే ఉండేవి. సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాళ్లు ఇలాంటి వార్తలు రాసేవాళ్లు. నిజానికి జరిగిన సంఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు .. కొంతమంది స్నేహితుల కారణంగా ఈ కేసులో చిక్కుకున్నాను. ఆ సమయంలో కరుణానిధి నాకు చాలా హెల్ప్ చేశారు" అని చెప్పుకొచ్చాడు.