Aamir Khan: బీజేపీకి మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు అమీర్ ఖాన్ సమాధానం ఇదే!
- 54వ పుట్టినరోజును జరుపుకున్న అమీర్ ఖాన్
- ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విన్నపం
- తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోనని స్పష్టీకరణ
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈరోజు తన 54వ పుట్టినరోజును జరుపుకున్నారు. ముంబై బంద్రాలో ఉన్న తన నివాసంలో భార్య కిరణ్ రావు, అభిమానులు, మీడియా సమక్షంలో వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఎన్నారైలు ఇక్కడకు వచ్చి ఓటు వేయడం కష్టసాధ్యమని... ఈ నేపథ్యంలో, వారి కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఈ సందర్బంగా ఎన్నికల్లో మీరు బీజేపీకి మద్దతు తెలుపుతారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... తాను ఏ పార్టీకి మద్దతు ప్రకటించనని చెప్పారు.