niharika: అల్లరి ప్రేమకథగా 'సూర్యకాంతం' .. ఆసక్తిని రేపుతోన్న ట్రైలర్
- నిహారిక ప్రధాన పాత్రగా 'సూర్యకాంతం'
- సరదాగా సాగే ప్రేమకథ
- ఈ నెల 29వ తేదీన రిలీజ్
విభిన్నమైన కథాకథనాలకు ప్రాధాన్యతనిచ్చే నిహారిక, తన తాజా చిత్రంగా 'సూర్యకాంతం' చేసింది. నిహారిక జోడీగా రాహుల్ విజయ్ చేసిన ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
సూర్యకాంతం .. పూజా అనే ఇద్దరు అమ్మాయిల ప్రేమ మధ్య నలిగిపోయే అభి అనే కుర్రాడి కథే ఈ సినిమా అనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమైపోతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాకి నిహారిక పాత్ర హైలైట్ గా నిలుస్తుందనే విషయం స్పష్టమైపోతోంది. ఈ సినిమాతో ఆమెకి హిట్ పడుతుందేమో చూడాలి