Andhra Pradesh: నా విశ్లేషణ కరెక్టు అయితే టీడీపీకి అన్ని స్థానాలు రావాలి: సీనియర్ నటుడు శివకృష్ణ
- ‘పసుపు-కుంకుమ’, వృద్ధాప్య పెన్షన్ ప్రభావం ఉండొచ్చు
- పథకాలు ఎప్పుడు ప్రవేశపెట్టారన్నది ముఖ్యం కాదు
- ప్రజలకు ఉపయోగపడ్డాయా? లేవా? అన్నది ముఖ్యం
తన అంచనా ప్రకారం ఏపీలో చంద్రబాబు చేసిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఆయన్ని గెలిపిస్తాయని సీనియర్ నటుడు శివకృష్ణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు మొదట్లో తీసుకొచ్చారా లేక చివర్లో తీసుకొచ్చారా? అనే ప్రశ్నలు ఉపయోగం లేనివని అన్నారు. పథకాలు ఎప్పుడు ప్రవేశపెట్టారన్నది కాదు కావాల్సింది, ప్రజలకు ఉపయోగపడ్డాయా? లేవా? అన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు.
‘పసుపు-కుంకుమ’, వృద్ధాప్య పెన్షన్ ల ప్రభావం ఉంటే, తాను చేసుకున్న విశ్లేషణ కరెక్టు అయితే టీడీపీకి 105 స్థానాలు రావడం ఖాయమని అన్నారు. ఒకప్పుడు గ్రాస్ రూట్ లో, గ్రౌండ్ లెవెల్ లో బాగా పనిచేయడంతో పాలిటిక్స్ పై తనకు కొద్దిగా పట్టు దొరికిందని చెప్పుకొచ్చారు. ఆ కామన్ సెన్స్ తోనే 2004లో ‘మనం ఓడిపోతున్నాం సార్’ అని చంద్రబాబుకు చెప్పానని గుర్తుచేసుకున్నారు. అప్పుడు, తాను చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదని, నమ్మినా నమ్మకపోయినా జరిగింది అదేనని అన్నారు. అలాగే, 2014లోనూ తాను చెప్పిందే జరిగిందని అన్నారు.