Priyanka Chopra: ప్రియాంక చోప్రా హెయిర్ స్టయిల్ తో వీరప్పన్ మీసాలకు ముడిపెట్టిన నెటిజన్లు!
- న్యూయార్క్ లో మెట్ గాలా ఈవెంట్
- విచిత్ర ఆహార్యంతో హాజరైన ప్రియాంక చోప్రా
- నెటిజన్ల జోకులు
కొన్నాళ్ల కిందట బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ స్టార్. అమెరికన్ టెలివిజన్ సీరియళ్లలోనే కాదు, హాలీవుడ్ సినిమాల్లో సైతం నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతోంది. అయితే, తాజాగా న్యూయార్క్ లోని 'మెట్ గాలా 2019' ఈవెంట్ కు ప్రియాంక చోప్రా హాజరైన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మెట్ గాలా కార్యక్రమం చారిటీల కోసం నిధులు సేకరించడానికి ఉద్దేశించినది కావడంతో, సెలబ్రిటీలు విచిత్ర వేషధారణతో వచ్చి తమవంతుగా నిధులు రాబట్టాలి. అందుకోసం ప్రియాంక చోప్రా కూడా యథాశక్తి ప్రయత్నించి సఫలమైందనే చెప్పాలి.
పిచ్చుక గూడును తలపించే తలకట్టు, దానిపై ఓ ఫ్రేమ్ వర్క్ తో ఆమె మెట్ గాలా ఫంక్షన్ లో చూపు తిప్పుకోనివ్వలేదు. ఉల్లిపొర లాంటి పలుచని దుస్తుల్లో, విభిన్నమైన మేకప్ తో ప్రియాంక ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే, ఆమె హెయిర్ స్టయిల్ బాగా రేగిపోయినట్టుగా ఉండడంతో నెటిజన్లు తమ ఊహాశక్తికి పదునుపెట్టారు.
ఓ నెటిజన్ ఆమె హెయిర్ స్టయిల్ ను శాండల్ వుడ్ స్మగ్లర్ వీరప్పన్ మీసాల్లాగా ఎంతో నైపుణ్యంతో మార్ఫింగ్ చేసి చూపించాడు. మరో వ్యక్తి, శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగ జుత్తుతో పోలిక పెడుతూ పోస్టు పెట్టాడు. ఇవేకాదు, ఇలాంటివే ఎన్నో ప్రియాంక చోప్రాను లక్ష్యంగా చేసుకుని ఫన్నీ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.