Vijay Sai Reddy: బెయిల్ రాదు... ఇక ఏ 'బాబు' ఈయన్ను రక్షిస్తాడో చూడాలి!: రవిప్రకాశ్ పై విజయసాయి రెడ్డి కామెంట్
- తప్పించుకునే దారులన్నీ బంద్ అయ్యాయి
- కోర్టులు తనను తాకబోవన్న భ్రమలో 'మీడియా నయీం'
- ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి
తెలుగు న్యూస్ చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, "పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి" అని వ్యాఖ్యానించారు.
పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 15, 2019