Balakrishna: బోయపాటిని రంగంలోకి దిగమన్న బాలకృష్ణ
- కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
- డిసెంబర్ నుంచి బోయపాటితో సెట్స్ పైకి
'కథానాయకుడు' .. 'మహానాయకుడు' సినిమాల తరువాత బాలకృష్ణ తన తదుపరి సినిమాను బోయపాటితో చేయనున్నట్టుగా చెప్పాడు. అయితే కొన్ని కారణాల వలన బాలకృష్ణ కేఎస్ రవికుమార్ ప్రాజెక్టును ముందుకు తీసుకురాగా, బోయపాటి సినిమా వెనక్కివెళ్లింది. ఈ గ్యాప్ పెరుగుతుండటంతో ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చుననే ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది.
అయితే, ఈ ప్రాజెక్టు ఉందనేది తాజా సమాచారం. కేఎస్ రవికుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల మొదటివారంలో మొదలు కానుంది. డిసెంబర్ 21న గానీ .. సంక్రాంతికి గానీ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేలా అన్నీ సిద్ధం చేసుకోమని బోయపాటికి బాలకృష్ణ చెప్పినట్టుగా సమాచారం. ఈ సినిమా తరువాత బాలకృష్ణ 'పింక్' రీమేక్ లో చేయనున్నట్టుగా తెలుస్తోంది.