Anushka Shetty: అనుష్కపై చిరుకోపం ప్రదర్శించిన ప్రభాస్!
- అనుష్క అందంపై వ్యాఖ్యలు
- ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేయదంటూ ఫిర్యాదు
- కాజల్ డ్రెస్సింగ్ స్టయిల్ బాగుంటుందంటూ కితాబు
టాలీవుడ్ లో ప్రభాస్, అనుష్కలది ఎంత హిట్ పెయిరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాలతో ప్రభాస్, అనుష్క జోడీ విశేష ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆచితూచి చిత్రాలు ఎంపిక చేసుకుంటున్నారు. సాహో సినిమాతో ప్రభాస్ ఈనెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుండగా, అనుష్క సైలెన్స్ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. కాగా, సాహో సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో అనుష్కపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనుష్క ఎంతో అందంగా ఉంటుందని, ఆకట్టుకునే రీతిలో నిండైన రూపాన్ని కలిగివుంటుందని చెప్పాడు. అయితే, ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేయదని చిరుకోపం ప్రదర్శించాడు. అనుష్కపై మీ అభిప్రాయం ఏంటని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ పైవిధంగా సమాధానమిచ్చాడు. ఇక, కాజల్ గురించి మాట్లాడుతూ, ఆమె ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందని తెలిపాడు. డ్రెస్ సెన్స్ ఉన్న వ్యక్తి అని కితాబిచ్చాడు.