Aricel-Max: చిదంబరంకు జ్యుడీషియల్ రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జ్యుడీషియల్ కస్టడీ
- ఈ నెల 19 వరకూ తీహార్ జైల్లోనే చిదంబరం
- సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరానికి షాక్ తగిలింది. ఈ కేసు విచారణ నిమిత్తం చిదంబరాన్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 19 వరకూ ఆ జైల్లోనే చిదంబరం వుంటారు.