Chinthamaneni Prabhakar: మరో కేసు విషయంలో.. ఏలూరు పోలీస్ స్టేషన్ కు చింతమనేని ప్రభాకర్ తరలింపు
- ఏలూరు జిల్లా జైల్లో ఉన్న చింతమనేని
- మరో కేసు విచారణ కోసం స్టేషన్ కు తరలించిన పోలీసులు
- విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం ఏలూరు జిల్లా కారాగారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఓ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో, మరో కేసుకు సంబంధించి జైలు నుంచి చింతమనేనిని ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసులు విచారించనున్నట్టు సమాచారం. విచారణ అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తోంది. చింతమనేనిపై అనేక కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే.