DK Shivakumar: మనం వారితో పోరాటం చేసి బయటపడాలి: తీహార్ జైల్లో డీకేతో సోనియాగాంధీ
- మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న డీకే శివకుమార్
- జైలుకు వెళ్లి పరామర్శించిన సోనియాగాంధీ
- సోనియా వెంట డీకే సోదరుడు సురేశ్
మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం తీహార్ జైలుకు వెళ్లి శివకుమార్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కలిశారు. ఈ సందర్భంగా శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో డీకే సురేశ్ మాట్లాడుతూ, శివకుమార్ వెంట పార్టీ మొత్తం ఉంటుందని సోనియా తెలిపారని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసును పెట్టారని... ఇతర కాంగ్రెస్ నేతలను కూడా టార్గెట్ చేశారని... బీజేపీతో మనం పోరాటం చేసి, బయటపడాలని సోనియా చెప్పారని తెలిపారు.