Vijay Devarakonda: 'గీత గోవిందం' మిస్ అయిన రకుల్!
- 'గీత గోవిందం'కోసం నన్ను అడిగారు
- డేట్లు ఖాళీ లేని కారణంగా వదులుకున్నాను
- చిన్న పాత్ర చేసినా బాగుండేదన్న రకుల్
హీరోలైనా .. హీరోయిన్లైనా తమ దగ్గరికి వచ్చిన కొన్ని సినిమాలను కొన్ని కారణాలవలన వదిలేస్తుంటారు. వేరేవాళ్లు చేసిన ఆ సినిమాలు భారీ విజయాలను అందుకున్నప్పుడు సహజంగానే బాధపడుతుంటారు. అలాంటి బాధనే 'గీత గోవిందం' సినిమా విషయంలో తను అనుభవిస్తూ ఉంటానని రకుల్ చెప్పింది.
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా చేసిన ఈ సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. రష్మిక కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. రష్మిక చేసిన పాత్ర కోసం ముందుగా రకుల్ ను అడిగారట. అయితే ఆ డేట్లలో 'దే దే ప్యార్ దే' షూటింగ్ ఉండటంతో రకుల్ సున్నితంగా తిరస్కరించింది. ఆ తరువాత 'గీత గోవిందం' సాధించిన సక్సెస్ చూశాక 'అయ్యో' అనుకుందట. ఆ సినిమాలో చిన్నవేషం వేసినా బాగుండేదేనని చాలా ఫీలైపోతూ ఉంటానని తనే స్వయంగా చెప్పుకొచ్చింది.