Girija: 'గీతాంజలి'లో హీరోయిన్ గిరిజకి అలా ఛాన్స్ దక్కిందట
- గిరిజ లండన్ లో పుట్టి పెరిగింది
- ఓ ఫంక్షన్ కోసం ఆమె ఇండియా వచ్చింది
- గిరిజను మణిరత్నం గారికి అమల పరిచయం చేశారు
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'గీతాంజలి' చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన 'గిరిజ'ను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. అలాంటి గిరిజను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు.
"గిరిజగారి మదర్ బ్రిటిష్ లేడీ .. గిరిజగారి తండ్రి కర్ణాటకలో డాక్టర్. ఈ ఇద్దరి వివాహం 'లండన్'లో జరిగింది. గిరిజ - అక్కినేని అమల అప్పట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకసారి ఒక ఫంక్షన్ నిమిత్తం ఇండియా వచ్చిన గిరిజను, అదే ఫంక్షన్ కి వచ్చిన మణిరత్నం గారికి అమల పరిచయం చేశారు. అప్పటికి ఆయన 'గీతాంజలి' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో వున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ గా గిరిజ అయితే బాగుంటుందని భావించి ఆయన అడగడం, సంతోషంతో ఆమె ఎగిరిగంతేయడం జరిగిపోయాయి. అలా ఆమె ఆ సినిమా చేసింది" అని చెప్పుకొచ్చారు.