Nithin: వచ్చే ఏడాది నితిన్ ప్రేమ వివాహం?
- ఓ తెలుగు అమ్మాయి ప్రేమలో నితిన్
- పెళ్లికి అంగీకరించిన ఇరు కుటుంబాలు
- వచ్చే ఏడాది ఏప్రిల్ లో దుబాయ్ లో పెళ్లి
టాలీవుడ్ హీరో నితిన్ ప్రేమలో వున్నాడనే వార్త వైరల్ అవుతోంది. ఓ తెలుగు అమ్మాయి ప్రేమలో నితిన్ ఉన్నాడని చెబుతున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అంగీకరించారని... పెళ్లికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విదేశాల్లో వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. దుబాయ్ లోనే ఈ పెళ్లి జరగవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలపై నితిన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న 'భీష్మ' చిత్రంలో నితిన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక నటిస్తోంది.