Pawan Kalyan: పంతం నానాజీ ఇంట్లో జనసేన కార్యకర్తలను పరామర్శించిన పవన్ కల్యాణ్
- కాకినాడ చేరుకున్న పవన్
- గాయపడ్డ జనసైనికులకు ఓదార్పు
- మహిళా కార్యకర్తలను అక్కునచేర్చుకున్న జనసేనాని
కాకినాడలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసైనికులను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం పరామర్శించారు. కాకినాడ వచ్చిన ఆయన జనసేన నేత పంతం నానాజీ ఇంట్లో జనసేన కార్యకర్తలను కలుసుకున్నారు. గాయపడిన మహిళా కార్యకర్తలను ఆప్యాయంగా అక్కునచేర్చుకున్న పవన్ వారిని ఓదార్చారు. వారు చెప్పిన విషయాలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు తమపై దాడి దృశ్యాలను పవన్ కు మొబైల్ ఫోన్ లో చూపించారు. మరోవైపు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తుండడంతో పోలీసు బలగాలను మోహరించారు.