Sunil: నా ఆరోగ్యం ఇప్పుడు భేషుగ్గా ఉంది: హాస్య నటుడు సునీల్
- ఇటీవల ఆసుపత్రిలో చేరిన సునీల్
- ఆరోగ్యం మెరుగుపడిందని వెల్లడి
- ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు చెప్పిన సునీల్
తొలుత కమేడియన్ గా, ఆపై హీరోగా తనేంటో నిరూపించుకున్న సునీల్, ఇటీవల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తనకు ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడిందని ఆయన తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన సునీల్, "నా క్షేమాన్ని కోరుకునే మీలాంటి వారి ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. నాపై చూపించిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ 'డిస్కో రాజా' చూసి ఆనందించండి" అని పేర్కొన్నారు.