Suma: యాంకర్ సుమ హావభావాలకు షాక్ అవుతోన్న నెటిజన్లు.. వీడియో వైరల్
- 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాటకు హావభావాలు
- '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాలోని పాట పాడిన సునీత
- వీడియో తీసి పోస్ట్ చేసిన గాయని
'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా' అనే పాటకు మంచి స్పందన వస్తోంది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా కోసం చంద్రబోస్ రాసిన ఈ సాహిత్యానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ పాటకు యాంకర్ సుమ ఇచ్చిన హావభావాలకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమెలో గొప్ప నటి కూడా ఉందని ఇప్పుడే తెలిసిందని కామెంట్లు చేస్తున్నారు.
'నెలవంకను ఇద్దామనుకున్నా ఓ ఓ ఓ ఓ.. నీ నవ్వుకు సరిపోదంటున్నా ఆ అ ఆ అ ఆ.. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే' అంటూ గాయని సునీత పాడుతుండగా సుమ ఈ హావభావాలు ఇచ్చింది. తాను పాడుతున్న పాటకు సుమ హావభావాలు ప్రదర్శిస్తున్న సమయంలో సునీత ఈ వీడియో తీసింది. ప్రస్తుతం 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా' పాట అందరి స్మార్ట్ఫోన్లలోనూ వినిపిస్తుంది. బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమా రూపుదిద్దుకుంది.