Nagababu: ఒక మాట మాత్రం కన్ఫామ్ గా అంటాను: నాగబాబు
- ఇంతకుముందు హిందువుల మతసామరస్యంపై నాగబాబు వ్యాఖ్యలు
- మరోసారి ఘాటైన ట్వీట్ చేసిన వైనం
- ట్రోలింగ్ చేసేవాళ్లకు, పెయిడ్ బ్యాచ్ కి, పెయిడ్ మీడియాకు సారీ చెప్పనంటూ ట్వీట్
- "పోయి చావండ్రా" అనే ఒక్క మాట మాత్రం చెబుతానని వెల్లడి
మెగా బ్రదర్ నాగబాబు హిందువుల మత సామరస్యంపై తనదైన శైలిలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి స్పందించారు. నా ప్రియమైన ట్రోలింగ్ వీరులు, పెయిడ్ బ్యాచ్ సభ్యులు, పెయిడ్ మీడియా ప్రతినిధులు మిమ్మల్ని గాయపరిచినందుకు సారీ అని చెబుతున్నాననుకుంటున్నారా... చెప్పను! "పోయి చావండ్రా" అనే ఒక్క మాట మాత్రం కచ్చితంగా అని తీరతాను" అంటూ నాగబాబు ఘాటుగా ట్వీట్ చేశారు. అంతేకాదు "గో టు హెల్" అని చెబుతున్న ఆడియో క్లిప్పింగ్ జిఫ్ ను కూడా పోస్టు చేశారు.