Allu Sirish: అల్లు శిరీష్ మూవీకి దర్శకుడిని ఖరారు చేసిన అల్లు అరవింద్

Rakesh Shashi Movie

  • స్లోగా సాగుతున్న అల్లు శిరీష్ కెరియర్ 
  • తమిళ హిట్ మూవీ రీమేక్ కి సన్నాహాలు 
  • రాకేశ్ శశికి దొరికిన అవకాశం   

యువ కథానాయకులందరూ రేస్ లో తమ సత్తా చాటుకోవడానికి పోటీ పడుతున్నారు. అల్లు శిరీష్ మాత్రం తాపీగా ఒక్కో సినిమాను చేస్తూ వస్తున్నాడు. పైగా సినిమా .. సినిమాకి మధ్య ఆయన ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ .. అల్లు శిరీష్ కోసం ఒక కథను సెట్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన ఒక సినిమాకి ఇది రీమేక్.

కథాకథనాల పరంగా .. కథానాయకుడి బాడీ లాంగ్వేజ్ పరంగా .. బడ్జెట్ పరంగా ఆ కథను రీమేక్ చేయడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో ఆయన తెరకెక్కించిన 'జత కలిసే'..'విజేత' సినిమాలు అంతగా ఆడలేదు. అయినా రాకేశ్ శశిపై గల నమ్మకంతో ఈ ప్రాజెక్టును ఆయనకి అప్పగించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News