Aishwarya Rajesh: ఇకపై అలాంటి తల్లి పాత్రలు చేయనంటున్న ఐశ్వర్య రాజేశ్
- తమిళంలో కథానాయికగా మంచి గుర్తింపు
- గ్లామరస్ హీరోయిన్స్ నుంచి గట్టిపోటీ
- గ్లామర్ కి దూరంగా వుండే పాత్రలు చేయనంటున్న ఐశ్వర్య
తమిళంలో తెల్లగా .. బొద్దుగా వుండే కథానాయికలను అక్కడి అభిమానులు ఎక్కువగా ఆరాధిస్తూ వుంటారు. రంగు తక్కువగా వుండే కథానాయికలు అక్కడ నెగ్గుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయినా గ్లామర్ కథానాయికలతో ఐశ్వర్య రాజేశ్ పోటీపడుతోంది. చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం కోసం, ఆమె చిన్న పిల్లల తల్లి పాత్రలను సైతం చేసింది. అలా 'కాకా ముట్టై'లో ఆమె చేసిన పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.
అప్పటి నుంచి హీరో సరసనే అయినప్పటికీ, చిన్న పిల్లలలకి తల్లిగానే ఆమె ఎక్కువ పాత్రలు చేసింది. ఇటీవల విజయ్ దేవరకొండ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలోను ఆమె ఓ పిల్లాడికి తల్లిగానే కనిపిచింది. గ్లామర్ కి దూరంగా వుండే ఇదే తరహా పాత్రలు వస్తుండటంతో, ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని ఆమె మీడియా ముఖంగా చెప్పేసింది.