Pragathi: తనయుడితో కలిసి నటి ప్రగతి మాస్ డ్యాన్స్... వీడియో ఇదిగో!

Actress Pragathi dances with her son as video goes viral

  • లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రగతి
  • తమిళపాటకు హుషారుగా స్టెప్పులు
  • వైరల్ అవుతున్న వీడియో

కరోనా కారణంగా సినీ పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో సినీ నటులు, సాంకేతిక నిపుణులు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ విరామ సమయంలో తాము చేస్తున్న పనులను ఫొటోలు, వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటూ వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, ప్రముఖ క్యారక్టర్ నటి ప్రగతి ఓ డ్యాన్స్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అందులో ఓ తమిళ మాస్ పాటకు ఆమె అంతే మాస్ గా స్టెప్పులేశారు. ఈ వీడియోలో ప్రగతి తనయుడ్ని కూడా చూడొచ్చు. తల్లితో కలిసి హుషారుగా చిందులేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News