Kalyan Dev: కన్నడ తెరపైకి చిరూ చిన్నల్లుడు

Super Machi Movie

  • కల్యాణ్ దేవ్ తాజా చిత్రంగా 'సూపర్ మచ్చి'
  • తెలుగుతో పాటు కన్నడలోను విడుదల
  • శ్రీధర్ సీపాన దర్శకత్వంలోను ఛాన్స్  

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ 'విజేత' సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆయన రెండవ సినిమాగా 'సూపర్ మచ్చి' రూపొందుతోంది. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, రియా చక్రవర్తి .. రచితా రామ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలోను విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే కన్నడ సుందరి అయిన రచితా రామ్ ను తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడలోను విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో కల్యాణ్ దేవ్ వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో ప్రాజెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీధర్ సీపాన ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News