RGV: మియా మాల్కోవాతో వర్మ మరో సినిమా.. ఈ సాయంకాలం టీజర్ విడుదల!
- గతంలో మియా మాల్కోవాతో జీఎస్టీ తీసిన వర్మ
- ఇప్పుడు 'క్లైమాక్స్'
- ట్విట్టర్లో ప్రకటించిన వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి శృంగార తార మియా మాల్కోవాతో కలిసి షార్ట్ ఫిలిమ్ తీస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. ఈ మూవీకి క్లైమాక్స్ అనే పేరు పెట్టారు. ఇప్పటికే ఆయన మియా మాల్కోవాతో జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్ )పేరుతో షార్ట్ ఫిలిం తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనమైంది.
ఆయనపై మహిళా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోసారి ఇప్పుడు ఆ స్టార్‌తోనే వర్మ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన కరోనాపై వెటకారంగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టు గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్చపర్చారు.
'కరోనా శాపం, లాక్డౌన్ ఆశీర్వాదంతో నేను, మియా మాల్కోవా కలిసి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు క్లైమాక్స్ టీజర్ విడుదల చేస్తున్నాం' అని వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా మియా మాల్కోవాతో దిగిన ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.