Pooja Hegde: హీరోయిన్ పూజ హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు
- ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దు
- ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్ చేసుకోవద్దని వ్యాఖ్య
- ఎట్టకేలకు తన అకౌంట్ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు మరో ట్వీట్
హీరోయిన్ పూజ హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎవరో సమంత గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పూజ తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని తన డిజిటల్ టీమ్ తనకు తెలిపిందని ఆమె ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు చెప్పింది. ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని, అలాగే ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్ చేసుకోవద్దని సూచించింది.
కాగా, ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆమె డిజిటల్ టీమ్ సరి చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజ మరో ట్వీట్ చేసింది. తన డిజిటల్ టీమ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఎట్టకేలకు తన అకౌంట్ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు చెప్పింది. ఇన్‌స్టాలో హ్యాక్ అయిన సమయంలో హ్యాకర్లు చేసిన పోస్ట్‌లను తొలగించినట్లు తెలిపింది.