Hansika: వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలపై హన్సిక స్పందన

Hansika response on her marriage news

  • హన్సిక పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం
  • తప్పుడు ప్రచారం అని కొట్టి పారేసిన హన్సిక
  • ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న హన్సిక

'దేశముదురు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక... ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లు ఆమెను పలకరించాయి. టాలీవుడ్ తో పాటు, తమిళ పరిశ్రమలో కూడా బిజీ ఆర్టిస్టుగా కొనసాగింది. ఇటీవలి కాలంలో హన్సిక పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ వ్యాపారవేత్తను హన్సిక పెళ్లాడబోతోందంటూ ఓ వెబ్ సైట్ ప్రచురించింది. ఆ తర్వాత నెటిజన్లు ఈ వార్తను వైరల్ చేశారు.

దీనిపై హన్సిక స్పందిస్తూ... తనకు కాబోయే వరుడు ఎవరంటూ ఎదురు ప్రశ్నించింది. నీకు పెళ్లవుతున్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదని ఓ స్నేహితుడు ఆమెను ట్వీట్ ద్వారా ప్రశ్నించగా... ఆ విషయం తనకు కూడా ఇప్పుడే తెలిసిందని, అందుకే చెప్పలేకపోయానని నవ్వుతూ సమాధానమిచ్చింది. తన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. హన్సిక ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది.

  • Loading...

More Telugu News